హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్ను మరియు నీటి పన్ను ల గురించి అవగాహన కోసం ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ డి ఈ రమేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున మాట్లాడుతూ పట్టణంలో ఇంటి పన్నులు పెరుగుతున్నాయని అవాస్తవాలను విని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారని, ఈరోజు నుండి ఏడు రోజులపాటు ఇంటి పన్నుల గురించి అవగాహన కల్పించడానికి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేసినాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులు పెంచలేదని, జి.ఐ.ఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సర్వే ద్వారా పన్నులను సరిచేస్తున్నామని, పన్ను చెల్లింపు ద