హిమాయత్ నగర్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకృష్ణ లాడ్జిలో ఉరివేసుకొని యువకుడు మృతి
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకృష్ణ లాడ్జిలో రాజశేఖర్ అనే యువకుడు ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.