తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన CPబ్రౌన్ 227వ జయంతిని మంగళవారం కందుకూరులో సాహిత్యాభిమానులు వేడుకగా జరిపారు. వేమన పద్యాలను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడని తెలుగు టీచర్ ఇనకొల్లు మస్తానయ్య కొనియాడారు. ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీష్ డిక్షనరీలను తొలిసారి ప్రచురించిన మహనీయుడు అన్నారు. లండన్ లోని 'ఇండియా హౌస్ లైబ్రరీ' నుంచి 2106 గ్రంథాలను మద్రాస్‌కు తెప్పించిన ఘనత ఆయనదేనన్నారు.