శ్రీశైలం హటకేశ్వరం గిరిజన గూడెంకు చెందిన కుడుముల చిన్నదేవయ్య అనే యువకుడుపై ఎలుగుబంట్లు శనివారం దాడి చేసి గాయపరిచాయి, బాధితుడు తెలిపిన వివరాల మేరకు, గూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లగా ఎలుగుబంట్లు దాడిచేసి తొడను గాయపరిచాయి అన్నారు, గట్టిగా అరుస్తూ పారిపోతుండగా 2 ఎలుగుబంట్లు అడవిలోకి పారిపోయాయి అన్నాడు, స్థానికులు వెంటనే అతన్ని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు,ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది,