తాడేపల్లిగూడెం: గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సీపీఎం మండల కన్వీనర్ రంగారావు డిమాండ్
గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అంటు వ్యాధులు బారిన పడుతున్నారని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సీపీఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, నాయకుడు చిర్ల పుల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. అనారోగ్యం కారణంగా ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లను ఆశ్రయిస్తున్నారని, వేలాది రూపాయలు ఆసుపత్రులకు ఖర్చు అవుతుందన్నారు.