పటాన్చెరు: క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్–14 కోకో పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులపాటు పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. క్రీడా పోటీలు మరియు క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు.