యాడికి మండలం నగురూరు గ్రామానికి చెందిన శరత్ కుమార్ (23) నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నాడు. గత నెలలో శరత్ కుమార్ బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల లో తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.