పటాన్చెరు: ఇంద్రేశం రోడ్డు మరమ్మత్తులు చేపట్టడంతో తీరిన రోడ్డు సమస్య
పటాన్చెరు నియోజకవర్గంలో ఒకప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అది ఎక్కడో కాదు… ఇంద్రేశం రహదారే! రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు నరకం చూశారు. ఇప్పుడు రోడ్డు మరమ్మత్తులు చేపట్టడంతో సమస్య పూర్తిగా తీరిపోయింది. ప్రస్తుతం రాకపోకలు సాఫీగా సాగుతుండటంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.