గిద్దలూరు: కంభం, గిద్దలూరు పరిసర ప్రాంతాలలో లాడ్జిలను తనిఖీ చేసిన పోలీసు అధికారులు, పూర్తి సమాచారాన్ని భద్రపరచాలన్న పోలీసులు
కంభం, గిద్దలూరు పరిసర ప్రాంతాలలో గురువారం పలు లాడ్జిలను తనిఖీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గదులను అద్దెకిచ్చే సమయంలో తప్పనిసరిగా వినియోగదారుడి పూర్తి వివరాలు సేకరించి రికార్డులో భద్రపరచాలని పోలీసులు లార్జిల నిర్వహకులకు వెల్లడించారు. అనుమానస్పదంగా లేదా నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో గదులను అద్దెకు ఇవ్వరాదని నిర్వాహకులకు సూచించారు. ఏదైనా అనుమానం వ్యక్తమవుతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.