వెంకటాపురం: పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చు : ములుగు కలెక్టర్ దివాకర టీఎస్
పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.