రాప్తాడు: ప్రసన్నయిపల్లి రైల్వే స్టేషన్ వద్ద బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ వద్ద శనివారం 12 గంటల 20 నిమిషాల సమయంలో గంగపుత్రుల కమ్యూనిటీ హాల్లో బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ నాగేంద్ర తదితరులు మాట్లాడుతూ బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో కిమ్స్ అవేరా ఆసుపత్రి, నుంచి ఆలంబన స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేసి మందులు సైతం పంపిణీ చేయడం జరిగిందని బెస్త సేవా సంఘం అధ్యక్షుడు ఎంవి రమణ, నాగేంద్ర తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం నాయకులు సవేరి ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.