గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుత్తికి చెందిన జగన్నాథ్ రెడ్డి మృతి
63వ జాతీయ రహదారిపై కిష్టిపాడు సమీపంలో ఈ నెల మూడో తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గుత్తికి చెందిన జగన్నాథ్ రెడ్డి (30) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రాయల చెరువు నుంచి గుత్తికి బైక్‌లో జగన్నాథ్ రెడ్డి వస్తుండగా ఎదురుగా ఆటో ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగన్నాథ్ రెడ్డిని గుత్తి ఆసుపత్రికి అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.