కుప్పం మండల పరిధిలోని ఊర్లఓబనపల్లి పంచాయతీకి చెందిన సుమారు 150 మంది బుధవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎంకే ఉడా చైర్మన్ సురేష్ బాబు, మండల అధ్యక్షుడు రాజగోపాల్, ఏఎంసి వైస్ చైర్మన్ శరవణ మరియు తదితరులు పాల్గొన్నారు.