ఉదయగిరి: రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలి: సింగారెడ్డి పల్లెలో ఏఓ చిన్నారెడ్డి రైతులకు అవగాహన కార్యక్రమం
సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లిలో మంగళవారం పొలం పిలుస్తోంది ప్రోగ్రాన్ని ఏవో చెన్నారెడ్డి నిర్వహించారు. సాగులో ఉన్న వరి పంటను పరిశీలించి, కాండం తొలుచు పురుగు ఉన్నట్లు గుర్తించారు. ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలుపై అవగాహన కల్పించారు. పంట వేసిన ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలని ఏవో సూచించారు.