కడప: YVU జాతీయ సేవా పథకం యూనిట్- 9 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన
Kadapa, YSR | Sep 16, 2025 యోగి వేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్- 9 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారంరోజుల ప్రత్యేక శిబిరంలో మంగళవారం ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి, పౌరులకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈ పథకాలను ఎలా ఉపయోగించాలో, వాటివల్ల కలిగే ప్రయోజనాలు, పరిమితులు వంటి విషయాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్: ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా గురించి వివరించారు.