అయ్యప్ప గురు స్వామి వెంకటేష్ ఆకస్మికంగా మృతి చెందడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని ఎమ్మెల్యే సురేంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మరియు సీనియర్ టీడీపీ నాయకులు చౌలం మల్లికార్జున అన్నారు. కళ్యాణదుర్గం కు చెందిన గురు స్వామి వెంకటేష్ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం కళ్యాణదుర్గంలో మృత దేహాన్ని ఉంచారు. మల్లికార్జున నివాళులర్పించి, సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.